'ఉద్యానవన తోటలను ప్రోత్సహించాలి'

'ఉద్యానవన తోటలను ప్రోత్సహించాలి'

E.G: లాభసాటిగా ఉండే ఉద్యానవన తోటలను ప్రోత్సహించాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. శనివారం రాజమండ్రిలో మండల హార్టికల్చర్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యానవన పంటలను వేసే రైతులను ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశ పెట్టాయని, వాటిపై రైతులలో అవగాహన కల్పించాలన్నారు.