రైతులకు మెరుగైన సేవలు అందించాలి: ఎమ్మెల్యే

రైతులకు మెరుగైన సేవలు అందించాలి: ఎమ్మెల్యే

కోనసీమ: కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం రావులపాలెంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని, చైర్మన్‌గా పల్లి మంగాదేవి, వైస్ చైర్మన్‌గా కె. శ్రీనివాసరావు, డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.