ఏదైనా పోగొట్టుకుంటే ఫిర్యాదు చేయడం మరువకండి!
HYD: పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తున్నారని, ఏదైనా పోగొట్టుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం మరువద్దని HYD సంతోష్ నగర్ పోలీసులు తెలిపారు. ఓ మహిళ నవంబర్ 15వ తేదీన తన ట్యాబ్ మిస్ కాగా.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి, నిరంతరాయంగా కేసును ఫాలో కావడంతో ట్యాబ్ దొరికింది. అనంతరం తన ట్యాబ్ అందజేసినట్లు తెలిపారు.