మొదలైన 'పది' తరగతి పరీక్షలు
SRPT: తుంగతుర్తిలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి పరీక్షలు మొదలు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. విద్యార్థులు హాల్ టికెట్లను తీసుకుని పరీక్ష కేంద్రాలకు వెళ్లి తమ కేటాయించిన గదిలోకి వెళ్లారు. మండలంలో మూడు పరీక్ష కేంద్రాల్లో 551 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు.