ఏజెన్సీలో కుప్పకూలిన భారీ డ్రోన్
అల్లూరి: ఏజెన్సీ ప్రాంతంలో ఓ భారీ డ్రోన్ కుప్పకూలింది. జి.మాడుగుల మండలం బొయితిలి దగ్గర అదుపు తప్పి రెడ్ వింగ్ సంస్థకు చెందిన భారీ డ్రోన్ చెట్లలో పడిపోయింది. ఏజెన్సీలో ఎమర్జెన్సీ వైద్య పరీక్షల కోసం ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఎవరి హాని జరగకపోవడంతో ఊపిరీ పీల్చుకున్నారు.