ఆశావర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలిగా తాడూరి లత

ఆశావర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలిగా తాడూరి లత

KNR: హుజురాబాద్ మండలం చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్స్ యూనియన్ ( సీఐటీయూ అనుబంధ) ఎన్నికలు బుధవారం హుజురాబాద్ పట్టణంలో జరిగాయి. ఈ ఎన్నికలకు జిల్లా సీఐటీయూ కార్యదర్శి ఎడ్ల రమేష్, ఆశావర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి మారెళ్ళీ లత హాజరై ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అధ్యక్షురాలిగా తాడూరి లత ఎన్నికయ్యారు. పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.