ధ్వజస్తంభ ప్రతిష్టా ప్రథమ వార్షికోత్సవం

ధ్వజస్తంభ ప్రతిష్టా ప్రథమ వార్షికోత్సవం

NLR: నగరంలోని శ్రీ సీతాలక్ష్మణ హనుమత్సమేత కోదండరామ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టా ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. ఈ మేరకు ఆలయ అర్చకులు కోగంటి వరదరాజు పెరుమాళ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాలు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనంతో ప్రారంభమైన ఈ వేడుకల్లో ధ్వజస్తంభానికి శాస్త్రోక్తంగా అభిషేకం, అలంకరణ చేశారు.