కమ్మజాతి అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలి: తుమ్మల
TG: సమాజ అభివృద్ధికి కమ్మ కులస్తులు కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కమ్మజాతి అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే.. సీతారామ ప్రాజెక్ట్ వంటి పనులు పూర్తిచేశామని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామని వెల్లడించారు.