'కోనేరును శుభ్రపరచండి'

'కోనేరును శుభ్రపరచండి'

KNR: కేశవపట్నం గ్రామంలోని శ్రీమన్ జీయర్ స్వామి మఠం వద్ద ఉన్న కోనేరు చెట్లు, పొదలతో నిండిపోవడంతో నిర్లక్ష్యానికి గురై వినియోగానికి నోచుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో భక్తులు అక్కడ మొక్కులు తీర్చుకోలేక గుడి వద్దే పూజలు చేస్తున్నారన్నారు. కోనేరు శుభ్రపరిచి తిరిగి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని, దాని ప్రాముఖ్యతను కాపాడాలని స్థానికులు కోరారు.