VIDEO: వాడపల్లి ఆలయంలో ఆకట్టుకున్న కోలాటం

VIDEO: వాడపల్లి ఆలయంలో ఆకట్టుకున్న కోలాటం

కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో స్వామి కళ్యాణోత్సవాలు రెండో రోజు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు నిర్వహించిన కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కళాకారులు వివిధ ఆధ్యాత్మిక గీతాలకు లయబద్ధంగా  కోలాటం నిర్వహించారు.  ఈ పాటలు దర్శనం కోసం వచ్చిన భక్తులను అలరించాయి.