గృహిణులకు రూ. 8,000 విలువైన కూపన్‌: స్టాలిన్ హామీ

గృహిణులకు రూ. 8,000 విలువైన కూపన్‌: స్టాలిన్ హామీ

ఇల్లత్తరసి పథకం కింద పన్ను చెల్లించని గృహిణులందరికీ రూ.8 వేల విలువైన కూపన్‌ను అందజేస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. గృహిణులకు నేరుగా నగదు ఇస్తే ఖర్చు అవుతుందని అందుకే వస్తువుల కొనుగోలు కోసం కూపన్ల పద్దతిని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం మహిళా కుటుంబ యజమానులకు ఇస్తున్న నెలవారి గౌరవ వేతనాన్ని రూ.1000 నుంచి రూ.2 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.