నర్మెటలో కొత్త రాతియుగం నాటి పనిముట్టు లభ్యం

SDPT: నంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామంలో కొత్త రాతియుగం నాటి పనిముట్టు లభ్యమైంది. ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ పాటిగడ్డపై పరిశీలిస్తున్నప్పుడు ఇది దొరికింది. త్రిభుజాకారంలో, మధ్యలో రంధ్రంతో ఉన్న దీనిని రాతి గొడ్డలిగా గుర్తించారు. ఈ ఆవిష్కరణ చరిత్రకారులలో ఆసక్తిని రేకెత్తించింది.