VIDEO: పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

VIDEO: పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

కోనసీమ: రాజోలు మండలంలోని అడవిపాలెంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 5 ఏళ్లుగా అడవిపాలెంలో ప్రజలు పంచాయతీ కార్యాలయం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా గ్రామపంచాయతీ భవన నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేస్తామన్నారు.