గుర్తుతెలియని మృతదేహం లభ్యం
VZM: కొత్తవలస మండలం తుమ్మకాపల్లి ఫైర్ స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. సుమారు 45 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి పింక్ షర్టు, నలుపు ప్యాంటు ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఎస్.కోట మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.