మదనపల్లెలో సంబరాలు.. చిన్నారి హత్య కేసులో కీలక పరిణామం
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బాలిక రిషిక ప్రియా హత్య కేసు నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి అంత్యక్రియలు పూర్తికాకముందే ఆమెను హత్య చేసిన నిందితుడు సమీప చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ వార్త వెలువడగానే నీరుగట్టువారిపల్లిలో స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు. “న్యాయం గెలిచింది”, “పోలీసులు జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు.