'కార్మికులకు వెంటనే జీతం చెల్లించాలి'
విజయనగరం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు మార్చి నెల వేతనాలు వెంటనే చెల్లించాలని మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కమిషనర్ బాలస్వామికి వినతిపత్రం అందజేశారు. నిధి పోర్టల్‌ను రద్దు చేసి ప్రభుత్వం నేరుగా జీతాలు చెల్లించాలన్నారు.