ఈనెల 22 లోగా ఇంటి పన్నులు చెల్లించండి: ఈవో
SKLM: నరసన్నపేట మేజర్ పంచాయతీలో ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేస్తున్నట్లు ఈవో పీ. ద్రాక్షాయిని తెలిపారు. శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో గృహ, దుకాణ యజమానులు వెంటనే పన్నులు చెల్లించాలని ఆదేశించారు. ఈనెల 22వ తేదీలోగా పన్నులు చెల్లించకపోతే నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.