బోర్‌వెల్ ఆఫీస్‌లో చోరీ.. నిందితుడు అరెస్ట్
RR: హయత్‌నగర్ పరిధిలో బోర్‌వెల్ ఆఫీస్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 9న పెద్ద అంబర్‌పేట్ వెంకటేశ్వర కాలనీలోని వ్యాపారి ఏ. వెంట్రాం రెడ్డి బోర్‌వెల్ కార్యాలయంలో తాళం పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు నిందితుడుని నిన్న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.