VIDEO: అకాల వర్షం.. అరటి రైతులకు భారీ నష్టం..!
KDP: సింహాద్రిపురం మండలం వ్యాప్తంగా నిన్న రాత్రి ఈదురు గాలులతో అకాల వర్షానికి అరటి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. అరటి పంట సాగు చేస్తున్న రైతులు పెద్ద ఎత్తున దెబ్బతిన్నారు. గాలుల తీవ్రతకు అరటి చెట్లు గెలలతో సహా నేలకొరగాయి. యుద్ధంతో ధరలు తగ్గాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి విపత్తు వారి పరిస్థితిని మరింత దుర్భరంగా మార్చిందని అన్నదాతలు వాపోతున్నారు.