ఈ నెల 21న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
GNTR: మంగళగిరి ఎమ్మెల్యే లోకేశ్ జన్మదినం (జనవరి 23) సందర్భంగా మంగళగిరిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు బుధవారం ప్రకటించారు. రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య మాట్లాడుతూ.. డిసెంబర్ 21న క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయని తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని ఆయన వివరించారు.