'సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలు జరుపుకోవాలి'

'సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలు జరుపుకోవాలి'

RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 27న ప్రారంభంకానున్న గణేష్ ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బండారి రమేష్ తెలిపారు. చతుర్థి రోజున వినాయకుడి ప్రతిష్టను చేసుకుని, సెప్టెంబర్ 6న నిమజ్జనం నిర్వహించుకోవాలన్నారు. 7వ తేదీన గ్రహణం ఉన్నందున ముందు రోజే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు.