ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన ఎంఈవో

ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన ఎంఈవో

SKLM: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేస్తున్న బోధన సామర్ధ్యాలు మరింత మెరుగుపడాలని ఎంఈవో ఉప్పాడ శాంతారావు తెలిపారు. బుధవారం నరసన్నపేట మండలం నరసింగపల్లి ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు అందజేశారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు.