OUలో ఈనెల 22 నుంచి నూతన కోర్సు ప్రారంభం

HYD: ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రెయినింగ్ (సెల్ట్)లో 'ఇంగ్లిష్ కమ్యునికేషన్ స్కిల్స్ & పర్సనాలిటీ డెవలప్మెంట్' కోర్సును ప్రారంభించనున్నారు. సాయంత్రం 6 నుంచి 7:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 20 లోపు రిజిస్టర్ చేసుకోవాలని సెల్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సవీన్ సౌద తెలిపారు.