నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వాగ్వాదం
AKP: నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. జోగునాదునిపాలెం రోడ్ల మరమ్మతుకు మున్సిపాలిటీ నుంచి నిధులు కేటాయించడంపై మున్సిపల్ వైస్ ఛైర్మన్ కోనేటి రామకృష్ణ, కౌన్సిలర్ బుల్లి దొర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన టీడీపీ కౌన్సిలర్ మధు మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం హయంలో ఏమి జరగలేదు అన్నారు.