విడదల రజినీ పీఏపై కేసు నమోదు

విడదల రజినీ పీఏపై కేసు నమోదు

AP: మాజీమంత్రి విడదల రజినీ పీఏ, అనుచరులపై కేసు నమోదైంది. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారని బాధితులు పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఉద్యోగాల పేరిట రూ.5 కోట్లు వసూలు చేసినట్లు వాపోయారు. దీంతో రజినీ ముఖ్య అనుచరులు శ్రీగణేష్, అతని సోదరుడు కుమారస్వామిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.