నారింజ వాగు ప్రాజెక్టుకు భారీ వరద

SRD: జహీరాబాద్ మండలం కొత్తూరు (బి) నారింజ వాగు ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. 3437 క్యూసెక్కుల వరద నీరు రావడంతో దిగువకు ఒక గేటు పైకి ఎత్తి జలాలు వదిలినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నిండడంతో ఇక్కడి ప్రాంత ప్రజలు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రాజెక్టు వద్ద అధికారులు, పోలీసులు అప్రమత్త చర్యలు తీసుకున్నారు.