VIDEO: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

VIDEO: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

W.G: తాడేపల్లిగూడెం పట్టణంలో యాగర్లపల్లిలో పెరుమాళ్ళ నాగమణి (70) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికంగా టిఫిన్ వ్యాపారం చేస్తూ ఒంటరిగా జీవనం సాగిస్తోంది. మృతురాలు తలపై గాయమై ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.