జిల్లాల్లో భారీ వర్షాలు.. తీవ్ర పంట నష్టం

జిల్లాల్లో భారీ వర్షాలు.. తీవ్ర పంట నష్టం

KRNL: జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా 1,676 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. తుగ్గలి, పెద్దకడుబూరు, ఆస్పరి, కౌతాళం, ఆదోని, దేవనకొండ, మద్దికెర మండలాల్లోని 36 గ్రామాలలో ఈ నష్టం సంభవించింది. వ్యవసాయ అధికారులు మంగళవారం ఈ అంచనావేశారు. పత్తి, కంది, వేరుశనగ, ఆముదం, సజ్జ తో పాటు ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి.