VIDEO: నీలకంఠేశ్వర స్వామివారికి వైభవంగా రుద్రాభిషేకం

VIDEO: నీలకంఠేశ్వర స్వామివారికి వైభవంగా రుద్రాభిషేకం

NLR: సంగం మండలం, మక్తాపురంలో వెలసిన శ్రీగంగా పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అర్చకులు మహన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకం నిర్వహించారు. తదనంతరం స్వామివారిని నయన మనోహరంగా అలంకరించి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని వారి మొక్కులు చెల్లించుకున్నారు.