'ఆహ్లాదకర వాతావరణంలో వైద్య సేవలే లక్ష్యం'
పార్వతీపురం రూరల్‌లోని పెదబొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో డా. ఎస్. భాస్కరరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు ఆహ్లాదకర వాతావరణంలో వైద్య సేవలు అందేలా పీహెచ్‌సీలను తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. ఓపీ విభాగం, వార్డు, ల్యాబ్, ఫార్మసీ, హెచ్‌పీవీ వ్యాక్సిన్ అమలు తీరును పరిశీలించి, రోగులు సంతృప్తి చెందేలా సేవలు అందించాలని అన్నారు.