'ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలి'
NRML: ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆమె మాట్లాడుతూ.. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు.