‘సాధ్యమైనంత వరకు యూరియా వాడకం తగ్గించాలి'

కడప: చాపాడులో బుధవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు పలు సూచనలు, సలహలను ఏవో దేవి పద్మలత తెలియజేశారు. సాధ్యమైనంత వరకు యూరియా వాడకం తగ్గించి, ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. యూరియాను అధికంగా వాడితే నేల తన సారవంతాన్ని కోల్పోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో స్వప్న, వీఏఏ సాయి తేజ, రైతులు ఉన్నారు.