రాష్ట్రంలో తొలి సైనిక్ స్కూల్!
TG: రాష్ట్రానికి తొలి సైనిక్ స్కూల్ మంజూరు కానుంది. వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని హకీంపేటలోని ఎడ్యుకేషన్ హబ్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని త్వరలోనే కేంద్ర రక్షణ పరిధిలోని సైనిక్ స్కూల్ సొసైటీ అధికారికంగా ప్రకటించనుంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు.