VIDEO: 'పశువులకు వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరి'
SRD: కంగ్టి మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ సయ్యద్ ముస్తాక్, స్థానిక సర్పంచి కృష్ణ ముదిరాజ్ కలిసి టీకాల ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం పశువైద్యాధికారి మాట్లాడుతూ.. పశువులకు సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని సూచించారు.