దోచుకో దాచుకో అనేది బీఆర్ఎస్ పేటెంట్ హక్కు: మంత్రి
JGL: ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. “దోచుకో దాచుకో అనేది బీఆర్ఎస్ పేటెంట్ హక్కు” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు చేస్తే కేటీఆర్ స్పష్టమైన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తప్పులు ఉంటే మీడియా ముందుకు తీసుకురావాలని, కేంద్ర సంస్థల సహాయంతోనైనా నిజాలు బయటపెట్టాలని సూచించారు.