బుడమేరు కమ్యూనిటీ హాల్లో ఎర్రన్నాయుడు 13వ వర్ధంతి
కృష్ణా: 30వ డివిజన్ పరిధిలోని బుడమేరు మధ్యకట్ట ప్రాంతంలోని విజయ దుర్గ నగర్ కమ్యూనిటీ హాల్లో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి 13వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డగా, ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆయన గౌరవార్థంగా ఈ కార్యక్రమంలో అనేక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.