VIDEO: మూసారాంబాగ్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనం
HYD: మూసారాంబాగ్ వద్ద ఇవాళ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 42 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని భాగ్యనగర్ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మలక్ పేట మూసారంబాగ్ ప్రధాన రహదారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు. అ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.