ఇళ్ళు కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలించిన జగన్
NTR: విజయవాడ భావనీపురం ఘటనా స్థలాన్ని మాజీ సీఎం జగన్ ఈరోజు పరిశీలించారు. 25ఏళ్ళుగా జీవిస్తున్న వారి ఇళ్ళు కూల్చటం దారుణమని తెలిపారు. రోడ్లు, డ్రైన్లు, ఇళ్ళు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చిన, ఇళ్ళు కూల్చటం ప్రభుత్వ చేస్తున్న కుట్ర అని పేర్కొన్నారు. దీనిలో ప్రైవేటు వ్యక్తులు, జనసేన కార్పొరేటర్ వెనకుండి నడిపించారని, బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఆయన తెలిపారు.