'బుక్కాపూర్ రహదారికి మరమ్మతులు చేయించండి'
GDWL: అలంపూర్ మండల కేంద్రం నుంచి బుక్కాపురం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై తారు లేచి గుంతల మయంగా మారింది. ఈ మార్గంలో గ్రామ ప్రజలు, రైతులు వివిధ పనులు నిమిత్తం వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు. గుంతల రోడ్డుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు వాపోతున్నారు. పాలకులు స్పందించి తారు లేచిన చోటా మరమ్మతులు చేసి రోడ్డు సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.