డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన ఎస్సై
ప్రకాశం: మద్యం తాగి వాహనాలను నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హనుమంతునిపాడు ఎస్సై మాధవరావు అన్నారు. శనివారం రాత్రి వేములపాడు రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. వాహనాల డాక్యుమెంట్స్‌ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రహదారి భద్రతా నిబంధనలు పాటించాలన్నారు.