కుర్దిస్థాన్ అధ్యక్షుడి నివాసం లక్ష్యంగా డ్రోన్ దాడి!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతీయ అధ్యక్షుడు నెచిర్వాన్ బార్జానీ నివాసం లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఇరాన్‌కు మద్దతుగల మిలిషియాలు ఈ దాడి చేశారని అమెరికా ఆరోపించింది. అయితే, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ హత్యాయత్నం చేసిందని టెహ్రాన్ తెలిపింది.