జనసేన బలోపేతంపై కంబదూరు నాయకుల సమావేశం
ATP: కళ్యాణదుర్గంలో జనసేన ఇంఛార్జ్ బాల్యం రాజేశ్ ఆధ్వర్యంలో కంబదూరు మండల జనసేన నాయకుల సమావేశం ఆదివారం జరిగింది. మండల, గ్రామ కమిటీల ఏర్పాటు, క్రియాశీలక సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. అనంతరం గ్రామ కమిటీ నివేదికను ఇంఛార్జ్‌కు అందజేశారు. ఈ సమావేశంలో శ్రీనివాసులు, వెంకటేష్, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.