కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం వాయిదా

NRML: నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం వాయిదా వేసినట్టు డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు గారు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ నెల 10 న నిర్వహించాల్సిన సమావేశాన్ని పాకిస్తాన్ పై భారత సైనిక చర్యకు మద్దతుగా, భారత సైనికులకు సంఘీభావంతో సమావేశాలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.