ప్రతి గింజను కొనుగోలు చేస్తాం: మంత్రి

E.G: జిల్లాలో అదనంగా 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు, అమ్మకాల విషయంలో వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దన్నారు. ధాన్యం కోనుగొలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గింజను కొంటామని మంత్రి నాదెండ్ల హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.