డీసీసీ అధ్యక్షుడికి నియామక పత్రం అందజేత

డీసీసీ అధ్యక్షుడికి నియామక పత్రం అందజేత

వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నియమితులైన శివసేన రెడ్డి అధ్యక్ష నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన టిపిసీసీ కార్యవర్గ సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, టిపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ఆయన ఈ నియామక పత్రాన్ని అందుకున్నారు.