పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

మనం నివసించే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జలుమూరు పీహెచ్సీ వైద్యాధికారి చల్ల వంశీకృష్ణ అన్నారు. జలుమూరు మండలం టెక్కలి పాడు గ్రామంలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోనే మలేరియా డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని సూచించారు.