ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

MBNR: భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సూచించారు. సరళసాగర్ దిగువ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. నేటి అర్ధరాత్రి వరకు కోయిల్ సాగర్ నిండి గేట్లు తెరిచే అవకాశం ఉన్నందున పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దన్నారు.