పాఠశాలలో బడిబాట కార్యక్రమం

SRD: కోహీర్ మండలం దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ ఛైర్మన్ సరస్వతి పాల్గొన్నారు.