అద్దంకిలో ఆస్తి పన్నుపై 50% వడ్డీ రాయితీ
BPT: అద్దంకి పట్టణ వాసులకు ఆస్తి పన్ను బకాయిలపై ప్రభుత్వం 50% వడ్డీ రాయితీ కల్పించిందని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 31లోపు చెల్లించిన వారికి మాత్రమే ఈ 50% రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, పాత బకాయిలతో పాటు ప్రస్తుత ఏడాది పన్నును కలిపి ఒకేసారి చెల్లించాలన్నారు.