సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

బాపట్ల: వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సూచనపై సీఎం సహాయ నిధి నుంచి భట్టిప్రోలు మండలంలోని ఐదు గ్రామాలకు చెందిన అనారోగ్య బాధితులకు రూ.1,64,859 మంజూరయ్యింది. కందుల అర్జునమ్మ, ముమ్మలనేని మల్లికార్జునరావు, చిలకా సామ్రాజ్యం, అడిగోపుల విజయ మారుతి మణి, జొన్నాదుల హేమలతకు మంగళవారం ఎమ్మెల్యే చెక్కులు అందజేశారు.